HomeCRIMEసైబర్ నేరానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు..

సైబర్ నేరానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు..

సైబర్ నేరానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పట్టుకొని అరెస్టు చేసినట్లు ఏసిపి రాజా వెంకటరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ..

ఈనెల 8, 9 తేదీల్లో నగరానికి చెందిన బసకొండ నరేశ్ ఖాతాల్లోంచి ఆయన ప్రమేయం లేకుండా రూ.1,04,999 డెబిట్ అయ్యాయి. దీంతో నరేష్ ఈనెల 11న స్థానిక నాలుగో ఠాణాలో ఫిర్యాదు చేశారు.

నరేష్ ఫిర్యాదు మేరకు టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డెబిట్ అయిన నగదు నగరంలోని ఆటోనగర్ కు చెందిన మహమ్మద్ అబ్దుల్(23) ఖాతాలోకి జమైనట్లు గుర్తించారు.

సాంకేతికత ఆధారంగా మహమ్మద్ అబ్దుల్తోపాటు ఏజెంటు గుడుముల నితీష్(24)లను అదుపులోకి తీసుకొని విచారించారు.నిజామాబాద్, బోధన్ చెందిన కొంతమంది రాజస్థాన్ కు చెందిన ప్రధాన నిందితులు ఒక ముఠా గా ఏర్పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురుద్దేశం తో నిజామాబాద్, బోధన్ చుట్టూ పక్కల ప్రాంతాల ప్రజలతో మమేకమై వారితో వివిధ బ్యాంక్ లో ఖాతాలు తెరిపించారు.

నిజామాబాద్,బోధన్ కు చెందిన కొంతమంది రాజస్థాన్ కు చెందిన ప్రధాన నిందితులతో ఓ సామాజిక మాధ్యమం వేదికగా ముఠాగా ఏర్పడి వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. ఆ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డు, సంతకాలు చేసిన చెక్ బుక్కులను డీటీడీసీ కొరియర్ ద్వారా రాజస్థాన్ కు పంపించారు.

సైబర్ నేరాల ద్వారా వచ్చిన డబ్బులు ఆయా ఖాతాల్లోకి జమచేసి ఆ తర్వాత విడ్ర చేసుకుంటారు. ఇలా వచ్చిన నగదులోంచి ఖాతాదారులకు ఒక్కొక్కరికి నెలకు రూ.15 వేలు, ఏజెంట్లకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తున్నారు. ఈ కేసులో 35 ఖాతాలను గుర్తించారు.

దేశవ్యాప్తంగా ఈ ఖాతాలపై 40 ఫిర్యాదులు వచ్చాయి. సుమారుగా రూ.50 లక్షలకు పైనే సైబర్ మోసాలు జరిగినట్లు పోలిసులు గుర్తించారు. ఈ కేసు చేదనలో టౌన్ సిఐ,నాలుగవ టౌన్ ఎస్ఐ,సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments