వేల్పూర్ మండలం అమీనాపూర్ శివారులో నిజాం సాగర్ కెనాల్ సమీపంలో అతివేగంతో చెట్టుకు ఢీకొట్టడం తో ఘటనలో కారు బోల్తా కొట్టింది.
ఈ రోడ్డు ప్రమాద దుర్ఘటనలో జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన యువరైతు అల్లూరి శ్రావణ్ రెడ్డి (32) అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రత్యక్ష సాక్షులు గమనించి మృతుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మృతుడి భార్య అల్లూరి హారిక రెడ్డి బంధువు దశరథ్ రెడ్డిని నుజ్జయిన కారులో నుంచి స్థానికులు బయటకు తీశారు.
