రైలు లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
ఆదివారం రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి, ఆర్‌పిఎఫ్ సిబ్బందితో కలిసి నిజామాబాద్ రైల్వే స్టేషన్ లోని ప్లాట్‌ఫాం నం. 1 వద్ద తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతున్న ఇద్దరు యువకులను పట్టుకున్నట్లు తెలిపారు.
దీంతో వారిని నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్‌కి తీసుకువచ్చి విచారణ చేసినట్లు తెలిపారు. విచారణలో,మహారాష్ట్ర నాందేడ్ జిల్లా, , బోర్గావ్ (పోస్ట్),కు చెందినగంగా ప్రసాద్ విశ్వంభర్ గైక్వాడ్ , అమోల్ విశ్వంభర్ గైక్వాడ్, ఇద్దరు కలిసి పలు రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు నిజం ఒప్పుకున్నారని తెలిపారు.
వారి నుంచి వన్‌ప్లస్ నోర్డ్ మొబైల్ ఫోన్ – రూ.35,000/- విలువైనది, రెడ్మీ 13C మొబైల్ ఫోన్ – రూ.8,500/- విలువైనది, నగదు రూ.18,700/- స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
