సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదటి రెండు గంటలు మందకొడిగా సాగింది. ఉదయం 11 గంటల తర్వాత వోటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం మొదలు పెట్టారు.
ఉదయం స్థానిక పాలిటెక్నీక్ పోలింగ్ కేంద్రంలో ఇవియం లు మొరాయించాయి. సాంకేతిక నిపుణులు సరి చేయడంతో పోలింగ్ మొదలైంది.
మరో వైపు ప్రముఖులు కూడా ఓటర్లకు స్ఫూర్తి నింపేవిధంగా ఉదయమే వోట్లు వేశారు. సోమవారం ఉదయం మొదలైంది 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం అరగంటల దాక సాగనుంది
.నిజామాబాద్ నగరంలో పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ స్థానిక బాల్ భవన్ లో ఎంపీ అర్వింద్ కాకతీయ కాలేజీ లో వోటు వేశారు. నిజాంబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి 29 మంది అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
నిజాంబాద్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 17 04 867 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గ మొత్తంలో1808 ఏర్పాటు చేశారు. 7773 సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.
ముందు బౌలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే పోలింగ్ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అటుదిటమైన భద్రత ఏర్పాటు చేసింది జిల్లా వ్యాప్తంగా సుమారు 57 కెమెరాలను ఏర్పాటు చేసింది ముఖ్యంగా సమస్య ఆత్మక ప్రాంతాలుగా ఉన్న పోలింగ్ కేంద్రాలలో బందోబస్తున సీనియర్ పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
జిల్లా లో ఉదయం 11 గంటల దాక ఎలాంటి అవాంఛనీయ ఘటనలుజరగలేదు.