ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఆత్మ హత్య కు పాల్పడి న అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ఆదివారం తెల్లవారు జామున మృతి చెందారు. ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పురుగుల మందు తాగి అపస్మార స్థితిలో వెళ్లడంతో మెరుగైన చికిత్సకోసం హైదారాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు.
ఎస్సై ఆత్మ హత్య ఉదంతం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. తాను ఎందుకు ఆత్మ హత్య చేసుకోవడానికి సిద్ధం అయింది ఎలాంటి మానసిక ఒత్తిడి కి గురైంది మృతుడు శ్రీనివాస్ ముందే వాట్స్ అప్ లో బంధువులు సన్నహితులకు మెసేజ్ చేసారు.
ఉన్నతాధికారులు సహచర సిబ్బంది ఓ ప్లాన్ ప్రకారం తనో అవినీతి పరుడిగా చిత్రీకరించారని అనేక కథనాలు పత్రికల్లో వేయించారని ఈ విషయంలో తాను ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యానని చివరికి డిఎస్పీ కి చెప్పిన ఫలితం కనిపించలేదని
అందుకే ఆత్మ హత్య కు సిద్ధం అయ్యాను కానీ విషం తాగిన తర్వాతే భార్య పిల్లలు గుర్తుకొచ్చారని అందుకే ప్రాణాలుకాపాడుకోవడానికి డయల్ 108 కు ఫోన్ చేసానని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేసారు .