Friday, April 18, 2025
HomeCRIMEఆగని ప్రైవేట్ ఆసుపత్రుల అరాచకాలు గర్భాశయ చికిత్స కోసం వస్తే గర్భశయాన్ని ...

ఆగని ప్రైవేట్ ఆసుపత్రుల అరాచకాలు గర్భాశయ చికిత్స కోసం వస్తే గర్భశయాన్ని తీసేసిన వైనం .షాహీన్ ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు బంధువులు -పర్మిషన్ లేని ప్రైవేట్ హాస్పిటల్ లను సీజ్ చేయాలని డిమాండ్

జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కాసుల కక్కర్తి కోసం చికిత్స కోసం రోగులప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.మనోరమ మెడికవర్ ఆసుపత్రుల దందాలు మరువక ముందే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డు పై ఉన్న షాహీన్ ఆసుపత్రి నిర్వాహక వెలుగులోకి వచ్చింది.

డెలివరీ కోసం వెళ్లిన ఓ మహిళా కు ఏకంగా గర్భాశయమే తొలగించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి ను మూసేయాలని సంబంధిత డాక్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. శనివారం డిఎంహెచ్ఓ కు బాధితులు ఫిర్యాదు చేశారు..బాన్సువాడ కు చెందిన రాహేల ఫిర్దోస్ డెలివరీ కోసం ఏప్రిల్ 17న నిజామాబాద్‌లోని ఖిల్లా రోడ్‌లో ఉన్న షాహీన్ హాస్పిటల్‌లో చేరినట్లు తెలిపారు. 20న డిశ్చార్జ్ చేశారని తెలిపారు.

కానీ ఏప్రిల్ 25వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఆమెకు విపరీతమైన కడుపునొప్పి, రక్తస్రావం అవడంతో, షాహీన్ ఆసుపత్రికి తరలించారని, అక్కడ , దాదాపు 4 గంటలు వేచి ఉన్నారని తెలిపారు.

ఉదయం 6.30 గంటలకు నొప్పితో డాక్టర్ వచ్చి, పరీక్ష ఫలితాలు చూసి కొన్ని పరీక్షలు, మందులు సూచించారని డాక్టర్ సనుబర్ రెహమాన్ ఆమె రక్తస్రావాన్ని నియంత్రించడానికి సరైన పరికరాలు లేవని (సెకండరీ పిపిహెచ్), చెప్పడంతో తాము అప్పటికప్పుడు మనోరమ ఆసుపత్రికి రిఫర్ చేశారని తెలిపారు.

అక్కడ, పొత్తికడుపు యొక్క అల్ట్రాసోనోగ్రఫీ నివేదిక నా గర్భాశయ కుహరంలో ద్రవ్యరాశి నుండి బయటకు వచ్చిందని, ఇది సి-సెక్షన్ తర్వాత గర్భాశయ కుహరంలో సరిగ్గా ఆపరేషన్ చేయకపోవడం (లోయర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్), పోస్ట్ ఆపరేషన్ కేర్ కారణంగా అల్ట్రాసోనోగ్రామ్ ద్వారా గుర్తించే నా గర్భాశయ కుహరంలో మావి మాస్ (నిలుపుకున్న ప్లాసెంటా) తీవ్రమైన రక్తస్రావం దారితీసిందని తెలిపారు. సంబంధిత డాక్టర్ రమాదేవి ఆమెను ఎమర్జెన్సీ బేస్‌పై ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారని, ఎక్స్‌ప్లోరేటివ్ లాపరోటమీ, ఆమె తీవ్రమైన అనియంత్రిత రక్తస్రావం దృష్ట్యా ప్రసూతి హిస్టెరెక్టమీ (గర్భాశయాన్ని శాశ్వతంగా తొలగించడం) చేసిందన్నారు.

షాహీన్ హాస్పిటల్‌లో ప్రాథమిక వైద్య పరికరాలు లేకపోవడం, సిబ్బంది కొరత కారణంగా (డాక్టర్లు, నర్సులు, సపోర్ట్ స్టాఫ్) తాను ఈ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చిందని బాధిత మహిళా తన పిర్యాదు లో పేర్కొంది., డా. సనుబర్ రెహమాన్, తో పాటు షాహీన్ హాస్పిటల్‌పై కఠిన చర్య తీసుకోవాలని, డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించకుండా ప్రవేట్ హాస్పిటల్ పై పర్యవేక్షణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!