శిక్షణలో ఉన్న ఐపిఎస్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొన్న ఘటన లో ఒకరు గాయపడ్డారు. నిజామాబాద్ నగరంలోని కమిషనరేట్ సమీపంలోనే ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
వినాయక నగర్ చెందిన అశోక్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో ట్రైనీ ఐపీఎస్ చైతన్య రెడ్డికి చెందిన ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. దీంతో అశోక్ తలకు గాయాలయ్యాయి. దీనితో వాహనం లో ఉన్న ట్రైనీ ఐపిఎస్ .
చైతన్య రెడ్డి అతన్ని హుటాహుటిన తన వాహనంలోనే హాస్పిటల్ కు తీసుకెళ్లింది.