హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుని *అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకోని ప్రతేక పూజ &హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తెలంగాణ హిందూ ధర్మ సంస్కృతి &సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకోవడం తన అదృష్టమన్నారు
భారత దేశంలో అత్యంత ఎత్తయిన ఉత్సవ విగ్రహంగా పేరు పొందిన ఖైరతాబాద్ గణేష్ కు & లడ్డుకు ఒక ప్రతేక స్థానం ఉందని అన్నారు…
ఆ గణేశుని ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వేడుకోవడం జరిగిందన్నారు…
ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్ గారిని ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది…
ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచందర్ గారు, ఇందూర్ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
