HomeTelanganaNizamabadఅర్బన్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఎవరు....? క్యాడర్ కు దిక్కెవరు....? పార్టీ అధికారంలో ఉన్నా పనుల కోసం...

అర్బన్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఎవరు….? క్యాడర్ కు దిక్కెవరు….? పార్టీ అధికారంలో ఉన్నా పనుల కోసం ఎవరిదగ్గరకు వెళ్లాలి…?అర్బన్ ఇంచార్జ్ షబ్బీర్ ఆలీనా? మహేష్ గౌడా? క్యాడర్ లో అంతర్మధనం…అర్బన్ నాయకులకు పెద్దదిక్కు సుదర్శన్ రెడ్డే నా…?

పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం అడుగులు పడుతున్నాయా? మరోసారి ఆశీకారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టిందా? ఇలా ఎన్నో అనుమానాలు పార్టీ నాయకుల్లో ఉత్పన్నమవుతున్నాయ్.

నిజామాబాద్ అర్బన్ విషయానికి వస్తే… అర్బన్ నియోజకవర్గంలో అసలు హస్తం పార్టీ ఇంచార్జ్ ఎవరన్న క్లారిటీ ఆ పార్టీ నాయకుల్లోనే లేదు. గత ఎన్నికల్లో అర్బన్ నుంచి పోటీ చేసిన షబ్బీర్ ఆలీ ప్రస్తుతం. ఎక్కువ సమయం కామారెడ్డికే ఇస్తున్నారు. అర్బన్ నియోజకవర్గంలో అడపాదడపా ఇలా వచ్చి అలా వెళుతున్నారు.

ఇక పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా అప్పుడప్పుడు వస్తూ పోతున్నారు. అసలు అర్బన్ నియోజకవర్గంలో అధికారంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే లీడర్ లేరంటున్నారు….పార్టీ అధికారంలో ఉన్నా… స్థానిక నాయకుడు లేక అర్బన్ కాంగ్రెస్ పరిస్థితి అంధకారంగా మారిందంటున్నాయ్ పార్టీ శ్రేణులు.

అర్బన్ కాంగ్రెస్ లో బలమైన లీడర్ కరువయ్యారన్న టాక్ హస్తం పార్టీలోనే వినిపిస్తోంది. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు. కోపం అన్న చందంగా మారింది అర్బన్ కాంగ్రెస్ పరిస్థితి. ఏ నేత దగ్గరకు వెళితే ఎవరికీ కోపం వస్తుందోనని క్యాడర్ గింజుకుoటోoదట…. మరోవైపు తాజా పొలిటికల్ అప్డేట్ అర్బన్ కాంగ్రెస్ లో వినిపిస్తోంది.

టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇక అర్బన్ పైనే ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలుస్తోంది. ఇక నుంచి అర్బన్ నియోజకవర్గానికి వారంలో కనీసం రెండు రోజులైనా కేటాయించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆంటే ఇండైరెక్ట్ గా ఇక తానే అర్బన్ ఇంచార్జ్ అన్న సాంకేతం క్యాడర్ కు ఇచ్చినట్లుగా అర్బన్ కాంగ్రెస్ లో టాక్ నడుస్తోంది. అటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కూడా రాజధాని నుంచి వస్తే…. జిల్లా కేంద్రంలోనే ఉంటూ…ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు.

చాలా మంది అర్బన్ క్యాడర్ కూడా ఆయన్ను కలుస్తూ టచ్ లో ఉంటున్నారు….. అయితే డీ ఎస్ తర్వాత అర్బన్ లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవి దూరమైంది. రెండు సార్లు అర్బన్ లో బీ ఆర్ ఎస్ పాగా వేస్తే ప్రస్తుతం బీజేపి ఎమ్మెల్యే గా ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా ఉన్నారు.

మరి కాంగ్రెస్ అర్బన్ పై గురి పెట్టేనా…? ఇక్కడ బలమైన నేతకు ఇంచార్జ్ ఇస్తే… క్యాడర్ కు బూస్ట్ దొరికినట్లవుతుంది. లేదంటే… మళ్ళీ మరో పార్థులకే అవకాశం ఉంటుందంటున్నారు విశ్లేషకులు. మరి ఇకనైనా అర్బన్ పై పార్టీ అధిష్టానం దృష్టి సారిస్తుందా…? ఇంచార్జ్ ఎవరనే దానిపై క్లారిటీ రానుండా? లేక ఇలానే లైట్ తీసుకుంటుందా అన్న అనుమానాలు అర్బన్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో రికేత్తుతున్నాయ్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments