ఇప్పటికే వరుస వివాదాలతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీమరో వివాదం లో చిక్కారు ఆయన గెస్ట్ హౌజ్ కాంపౌండ్ వాల్‌ను గ్రామస్తులు కూల్చివేశారు.షబ్బీర్ అలీ కి మెదక్ జిల్లా రామాయంపేట్ పరిధి లోని జాస్తి శివనూర్ లో ఓ ప్రైవేట్ గెస్ట్ హౌజ్ ఉంది ఇటీవలే చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారు.
కానీ ఈ గోడ వల్ల తమ పంట పొలాలకు వెళ్లే దారి లేకుండ పోయింది. అదే గ్రామస్తుల ఆగ్రహానికి కారణం అయింది పంట పొలాలకు వెళ్లడానికి తాతముత్తాల కాలం నుంచే రహదారి ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. .
గతంలో ఈ సమస్యపై అనేకసార్లు స్వయంగా షబ్బీర్ అలీకి విన్నవించిన లైట్ తీసుకున్నారని పైగా గోడ కట్టేశారని దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు శనివారం ఉదయాన్నే ఒక్కసారిగా గెస్ట్ హౌజ్ వద్దకు చేరుకుని కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు
