కామారెడ్డి బస్టాండ్ నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు వడ్లూరు వద్ద బురద లో కురుక పోయింది.పూర్తీ ఓవైపు వంగి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు అప్రమత్తం అయిన డ్రైవర్ వెంటనే ప్రయాణీకులను దించేసాడు.
ఆర్టీసీ కామారెడ్డి నుంచి రామారెడ్డి, వెళ్తుంది బస్సుకు ఎదురుగా వాహనాలు రావటంతో వడ్లూరు గ్రామ సమీపంలో డ్రైవర్ బస్సును సైడ్ కి తీసుకునే క్రమంలో రోడ్డు నుంచి కిందకి దించాడు. పక్కన ఉన్న రోడ్డు బురదగా ఉంది బస్సు అందులోనే కూరుకుపోయింది.
ఆగిపోయిన బస్సును డ్రైవర్ వేగం పెంచడంతో మరింత రోడ్డు పక్కన ఉన్న బురదలో కూరుకుపోయి మొరాయించి సైడ్ కి ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. బస్సు ఒక సైడ్ లేచి ప్రమాదకరంగా మరింత లోతుకు దిగిపోయింది.
దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ బస్సుని ఉన్న పక్కకు నిలిపి ప్రయాణికులను కిందకి దించాడు. ఈ రహదారిపై బస్సు బురదలో కూరుకుపోవడం ఇది రెండోసారి
