HomeTelanganaNizamabadత్వరలో నిజామాబాద్ కు వందేభరత్ రైలు..నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్

త్వరలో నిజామాబాద్ కు వందేభరత్ రైలు..నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్

నిజామాబాద్ ముంబై ల మధ్య వందేభరత్ రైలు కోసం ప్రయత్నిస్తున్నానని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

శనివారం నిజామాబాద్ ఛాంబర్స్ ఆఫ్ కామోర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షులుగా రాజు, కార్యదర్శిగా శ్రీనివాసరావు,బెజవాడ గణేష్ గుప్తా ల చేత ప్రమాణస్వీకారం చేయించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…

నిజామాబాద్ జిల్లాకు వందే భారత్ రైలు మంజూరు కోసం చేసిన వినతి, మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్ లో ఉందని అందుకు తాము ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారని.అలాగే జిల్లా కేంద్రంలో రైల్వే బైపాస్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.

ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా మధ్య రైల్వే లైన్ కు మాజీ సీఎం కేసీఆర్ సంతకం చేయలేదని గుర్తు చేశారు.కేవలం కేంద్ర ప్రభుత్వం స్వంత నిధులతో మాత్రమే పనులు చేస్తున్నమన్నారు.

ఇక జిల్లాతో ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాల నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా జిల్లాలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నానని అన్నారు.

వ్యాపార, వాణిజ్య లకు అన్ని విధాలుగా సహాయం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నూడ చైర్మన్ కేశ వేణు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఛాంబర్ ఆఫ్ కామోర్స్ అండ్ ఇండస్ట్రీ మాజీ ప్రెసిడెంట్ అడ్వకేట్ జగదీశ్వర్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments