HomeTelanganaNizamabadదేశం కోసం, ధర్మం కోసం ఓటు వేయండి: ఎంపీ అరవింద్..

దేశం కోసం, ధర్మం కోసం ఓటు వేయండి: ఎంపీ అరవింద్..

దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని 45వ డివిజన్‌లోప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.


ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి, తమ తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈసారి రికార్డ్ బ్రేకింగ్ టర్న్ అవుట్ ఇందూరు పట్టణం నుంచే నమోదు కావాలని ఆయన ఆకాంక్షించారు.

దూరంగా ఉన్న అభ్యర్థులను, పార్టీలను ప్రజలు ఎంచుకోవాలని స్పష్టం చేశారు. నిజామాబాద్‌ను నూతనమైన ‘క్లీన్ పట్టణం’గా రూపకల్పన చేసేందుకు ప్రజలు మార్పుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు.


ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, ఇందూరు ప్రగతి కోసం ఓటు అనే ఆయుధాన్ని వాడాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments