HomeCRIMEకిల్లా రోడ్డులో దొంగ ఓటు కలకలం.. యువతి అరెస్ట్!

కిల్లా రోడ్డులో దొంగ ఓటు కలకలం.. యువతి అరెస్ట్!

కిల్లా రోడ్డులోని పోలింగ్ కేంద్రంలో దొంగ ఓటు వేసేందుకు సాహసించిన ఓ యువతిని అప్రమత్తమైన సిబ్బంది పట్టించారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కిల్లా రోడ్డులోని గోల్డెన్ జూబ్లీ విద్యాసంస్థలో ఓటర్లు బారులు తీరారు.

ఇదే క్రమంలో ఒక యువతి ఓటు వేసేందుకు లోపలికి వెళ్లింది. ఆమె పత్రాలను పరిశీలిస్తున్న క్రమంలో మహిళా పోలింగ్ సిబ్బందికి అనుమానం రావడంతో గట్టిగా నిలదీశారు.

దీంతో ఆ యువతి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు బండారం బయటపడింది. అది తన ఓటు కాదని, మరొకరి పేరుతో ఓటు వేసేందుకు ప్రయత్నించినట్లు సిబ్బంది గుర్తించారు. ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేస్తూ దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించిన ఆ యువతిని సిబ్బంది వెంటనే పోలీసులకు అప్పగించారు.

పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ అక్రమం వెనుక రాజకీయ నేతల హస్తం ఉందా? లేక మరెవరైనా యువతిని ప్రలోభపెట్టారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ ఓటు వేయడం నేరమని, పట్టుబడితే జైలు శిక్ష తప్పదని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments