ఆర్మూర్ లో ప్రారంభమైన రైతు నిరసనశగా సెప్టెంబర్ 15లోగా బేషరతుగా రుణమాఫీ చేయకుంటే అసెంబ్లీ ముట్టడి వరకు వెళ్తుందని రైతు ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆర్మూర్ లో తలపెట్టిన చలో ఆర్మూర్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నిరసన స్థలం కిక్కిరిసిపోయింది.
పోలీసుల ఆంక్షల మధ్యలో రైతులు చేపట్టిన నిరసన ధర్నా విజయవంతమైంది. శాంతియుత నిరసన ద్వారా తమ ఆగ్రహాన్ని వెళ్ళబుచ్చిన రైతన్నలు రోడ్డెక్కి పరిస్థితి రానివ్వద్దని ప్రభుత్వాన్ని కోరారు.
రైతు నిరసనకు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో పాటు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లు నిరసన స్థలానికి తరలివచ్చారు.
రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ… రైతులకు దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ షరతులు విధించకుండ రైతు రుణమాఫీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
రైతులు జాతీయ రహదారిపై వెళ్లి నిరసన తెలుపకుండా సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు పోలీసులు మోహరించారు.
సెప్టెంబర్ 15 లోపు రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయకపోతే భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తామని రైతు ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు వివరించారు.
మొత్తానికి శాంతియూత నిరసన తెలిపేందుకు రైతులు చేపట్టిన నిరసన దీక్ష ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇచ్చిన మాట మేరకు పోలీసులు విధించిన ఆంక్షలు దృష్టిలో పెట్టుకొని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన మాట మేరకు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నిస్సన దీక్ష మధ్యాహ్నం రెండు గంటలకు పూర్తయింది.