రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలైన ఘటన నగరంలోనీ నాలుగవ టౌన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..
కులస్పూర్ గ్రామానికి చెందిన లకవాత్ రవీందర్ అతని భార్య సవిత ఇరువురు బోర్గం నుంచి పులంగ్ వైపు ద్విచక్ర వాహనం పై వెళ్తున్న క్రమంలో ఓ మిని బస్సు అతివేగంతో రోడ్డు క్రాస్ చేసే క్రమంలో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు.
