లోకసభ ఎన్నికల్లో అధికారం కోల్పోతున్నామని సహనం కోల్పోతున్న మోడీ తమకు లీగల్ నోటీసు లపేరుతో బెదిరింపులకు దిగుతున్నాడని కానీ తాము వాటిని న్యాయ పరంగానే ఎదుర్కుంటామని.
ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడేది లేదన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. స్పష్టం చేసారు. ఆయన మంగళవారం స్థానిక వంశీ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నోటీసులకు ధీటైన సమాధానం ఇస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ మార్ఫింగ్ వీడియోలు చేయలేదని.. మార్ఫింగ్ లో బీజేపీ ప్రపంచంలో నే దిట్టని విమర్శించారు.
రిజర్వేషన్లు అంబేద్కర్ ఇచ్చిన హక్కు అని..రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే బీజేపీఎదురు దాడికి దిగిందని మహేష్ దుయ్యబట్టారు. ఇందులో భాగంగానే ఫేక్ వీడియోల కుట్రకు దిగిందని ఆరోపించారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో గ్యారెంటీ హామీలు అమల్లోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని.. ఆ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కొనసాగుతోందన్నారు.
ఈ విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. లోక్ సభ ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాల్లో గెలుస్తామని.. రాష్ట్రంలో కేసీఆర్ శకం ఇక ముగిసినట్టేనని చెప్పారు.బిఆర్ యస్ మునిగిపోయే పడవన్నారు