జీవనో పాది కోసం మస్కట్ వెళ్లిన వేల్పూర్ మండలం వాడి గ్రామానికి చెందిన యువకుడు అదృశ్యం అయ్యాడు.
కుటింబీకులు ఆందోళన చెందుతున్నారు. వాడి గ్రామానికి చెందిన గోలి శివప్రసాద్(27) ఈనెల 17 న మస్కట్ కు బల్డియా వీసా పై వెళ్ళాడు. కంపెని లో రిపోర్ట్ చేసిన రెండు రోజులకే ఆచూకీ లేకుండా పోయారు . ప్రస్తుతం ఎక్కడ ఉన్నది తెలియ రావడం లేదు.
అతనికి సంబంధించిన ఫోన్, ఇతర సామాగ్రి తనకి కేటాయించిన గదిలోనే వదిలేసి వెళ్ళాడు. ఒక్కగానొక్క కొడుకు పొట్టకూటి కోసం మస్కట్ వెళ్లి అదృశ్యం కావడంతో శివప్రసాద్ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది.
తండ్రి గోలి గంగాధర్ సోదరుడు చింటూ లు ఆర్మూర్ లో ప్రవాస భారతీయుల కోసం స్పందించే కోటపాటి నరసింహ నాయుడు ని కలిశారు. అదృశ్యం అయిన తమ బిడ్డ ఆచూకీ తెలుసుకోవాలని కోరారు