సుమారు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 10వ తరగతి ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఐదు లక్షలకు పైగ విద్యార్థుల్లో 451272 మంది పాస్ అయ్యారు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.
తాజాగా విడుదలైన తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో బాలురు 89.41శాతం.. బాలికల్లో 92శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో 3,927 స్కూళ్లలో 100శాతం ఫలితాలు వచ్చాయి. 6 ప్రైవేట్ స్కూళ్లలో జీరో ఫలితాలు నమోదయ్యాయి.నిర్మల్ 99.06 శాతంతో మొదటి స్థానంలో ఉండగా వికారాబాద్ అత్యల్పంగా 66శాతం ఫలితాలను రెంవ స్థానంలో సిద్దిపేట మూడవస్థానంలో రాజన్న సిరిసిల్ల సాధించినట్టు కార్యదర్శి వెల్లడించారు.
ప్రభుత్వ గురుకుల్లో 98% ఉత్తీర్ణత కాగ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాల్లో 93.74% తెలుగు మీడియం పాఠశాల్లో 80.71% ఉత్తీర్ణత వచ్చాయి. ఇక.. 8883 మంది 10జీపీఏ సాధించినట్టు బోర్డు కార్యదర్శి తెలిపారు. తెలంగాణ 10వ తరగతి పరీక్షల్లో గత ఏడాదితో (86.6%) పోలిస్తే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించినట్టు విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం తెలిపారు.
నిజామాబాద్ జిల్లా 93.72% 14 స్థానంలో కామారెడ్డి 92.71% 19 స్థానంలో నిలిచాయి. ఓవరాల్‌గా ఉత్తీర్ణతలో 91శాతం ఉత్తీర్ణత సాధించినట్టు చెప్పారు. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు:జూన్ 3 నుంచి 13వరకు ఉదయం 9.30 నుంచి 12.30వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. పదో తరగతి ఫలితాలతో విద్యార్ధులు ఒత్తిడికి గురి కావొద్దని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు.
సాధించలేని వారికి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు. ఫలితాలతో కలత చెందొద్దని సూచించారు
//////// నిజామాబాద్ లో 93 .72 శాతం ఉత్తీర్ణత .////////
పదో తరగతి ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా14 స్థానం నిలిచింది.
93 .72 మంది ఉత్తీర్ణత అయ్యారు.
21 858 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగ 20486 మంది పాస్ అయ్యారు.
గత ఏడాది 87 .12 శాతమే ఉత్తీర్ణ వచ్చింది.