HomeTelanganaNizamabadమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయ్ కృష్ణ

మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయ్ కృష్ణ

ఈ రోజు ఇందూరు జిల్లా కేంద్రం లోని ప్రగతి నగర్ చౌరస్తా లో బీజేవైఎం ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే దిష్టి బొమ్మ దగ్నం చేయడం జరిగింది

ఈ సందర్బంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయ్ కృష్ణ మాట్లాడుతు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని “ఉగ్రవాది”తో పోల్చడం అత్యంత దురదృష్టకరం, తీవ్రంగా ఖండించదగిన చర్య అని అన్నారు.

ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.అలాగే, ఈ వ్యాఖ్యలు ఎవరి సూచన మేరకు చేయబడ్డాయో రాహుల్ గాంధీ , సోనియా గాంధీ గారు వెంటనే స్పష్టం చేయాలని, దేశ ప్రజలకు మరియు ప్రధానమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిరాధార ఆరోపణలతో రాజకీయ లాభం పొందాలని చూస్తోందని, ఇది వారి అసహనం మరియు వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దేశంలో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రజలు మరిచిపోలేదని, ఆ కాలంలో దేశ భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తాయని అన్నారు.

చివరగా, దేశ నాయకుడిపై అనవసర దూషణలు మానుకుని ప్రజల సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమం లో బీజేవైఎం నాయకులు బండారి సంతోష్, భాస్కర్ రెడ్డి, సంజీవ్, రమేశ్వర్, క్రాంతి, బొట్టు సాయి, సురేష్, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments