Wednesday, April 22, 2026
HomePOLITICAL NEWSUncategorizedకెసిఆర్ హరీష్ లకు బిగ్ రిలీఫ్.....

కెసిఆర్ హరీష్ లకు బిగ్ రిలీఫ్…..

కాళేశ్వరంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఫై తదుపరి చర్యలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ అంశంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మాజీ మంత్రి హరీశ్‌రావు లకు హైకోర్టులో భారీ ఊరట లభించింది.

ఇరు పక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం కాళేశ్వరం ఎత్తిపోతలపై కమిషన్ ఏర్పాటను సమర్థిస్తూ. నివేదిక తయారుచేసే సమయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది.

సెక్షన్ – 8 కింద నోటీసులు ఇవ్వకుండా నిరాధర ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని తెలిపింది. నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీకోవద్దని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఇదే కేసులో పిటిషన్లు దాఖలు చేసిన మాజీ సీఎస్ ఎస్కే జోషీతో పాటు నాటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు కూడా ఊరట లభించినట్లైందివిచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. తమ క్లయింట్లను నివేదిక రూపొందించే సమయంలో సాక్షులుగానే వివరాలు అడిగారని కోర్టుకు తెలిపారు.

తీరా చూస్తే.. తన క్లయింట్లు తప్పు చేసినట్లుగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. కమిషన్ ఎంక్వైరీ యాక్ట్ -1952 (సెక్షన్-8B) (సెక్షన్-8C) ప్రకారం.. ఎవరినైనా సాక్షులుగా విచారించినప్పుడు వారిపై ఎలాంటి అభియోగాలు మోపకూడదని గుర్తు చేశారు.

ఒకవేళ ఆ అభియోగాలు నిజమైతే వేరుగా ఒక్కోక్కరికి నోటీసు విచారించాల్సి ఉంటుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!