నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ మృతుడు ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల నిందితుడు రియాజ్ దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి మంగళవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సిన్సియర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రమోద్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్యం మీకు అండగా ఉంటుందని బరోసా కల్పించారు.
అలాగే
వారికి అవసరమైన సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య, అడిషనల్ డిసీపీ బస్వా రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
