పండగ రోజుని సైతం లెక్క చేయకుండా కామారెడ్డి పోలీసులు జోరు వర్షంలోనే వరద సహాయక పనుల్లో నిమగ్నం అయ్యారు అనేక ప్రాంతాల్లో వరదల్లో ప్రజలు చిక్కుక పోయారు.
తమను రక్షించాలంటూ బాధితుల హహా కారాలతో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మరీ ఆయా ప్రాంతాల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.
కామారెడ్డి సీఐ నరహరి నాయక్ స్వయంగా వరద లో చిక్కుక పోయిన వృద్ధులను భుజాల మీద మోసుకొచ్చారు. ఆయన వెంట వచ్చిన సిబ్బంది సైతం చిన్నారులను తమ భుజాల మీద మోసుకొని షెల్టర్ లకు తరలించారు.
పండగ రోజు కావడంతో ఇతర ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో లేకుండే దీనితో పోలీసులు అన్నీ తామై ఆపన్నహస్తం అందించారు .
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలలోని నర్సంపల్లి ఎస్టీ రెసిడెన్షియల్ విద్యార్థులు (300మంది) జలదిగ్బంధంలో ఉన్న విషయం తెలుసుకొని వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
