ఏపీలోని అల్లూరి జిల్లాలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. తనిఖీలకు వెళ్లిన పోలీసులపై తిరగబడి రాళ్ల దాడి చేశారు.చివరికి పోలీసులు కాల్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది ఈ ఘటన ఏపీ లోని అల్లూరి జిల్లాలో గురువారం జరిగింది అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుగడ్డ దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తున్నారు .
ఈ క్రమంలో గంజాయి తరలిస్తున్న కారును ఆపి తనిఖీ చేస్తుండగా…కారులో ఉన్న గంజాయి ముఠా రాళ్ల దాడికి దిగింది అంతే కాకుండా హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నాడని.పోలీసులు ఒకసారిగా షాక్ అయ్యారు వెంటనే తేరుకొని పోలీసులు. గాల్లోకి కాల్పులు జరపడంతో స్మగ్లర్లు లొంగిపోయారు .
ఈ ఘటనలో నలుగురు నిందితులను అదుపులో తీసుకున్నామని… వీరు ఆంధ్ర, ఒడిస్సా, చతిస్గడ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారగా గుర్తించామని తెలిపారు పోలీసులు. నిందితుల దగ్గరి నుంచి 209 కిలో గంజాయి, రెండు బైకులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు
