యాజమాన్యంనగరంలోని వెల్నెస్ హాస్పిటల్స్ యాజమాన్యం ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ ఏసిపి సయ్యద్ మస్తాన్ అలీ కి 100 బారికేడ్లను అందజేసినారు .
ఈ సందర్భముగా ఏసిపి మాట్లాడుతూ ఇట్టి బారికేడ్లను నిజామాబాద్ నగరములో ట్రాఫిక్ ను నియంత్రించడానికి రోడ్ పైన ఇతర అవసముల కొరకు ఉపయోగిస్తామని తెలిపారు.
వాహనదారులు రోడ్ పైన వాహనములు పార్కింగ్ చేయవద్దని, పార్కింగ్ సెల్లార్, పెయిడ్ పార్కింగ్, కాలి స్థలములలో చేయాలని సూచించారు.
వాహనదారులు రోడ్ నియమాలను పాటించాలని తెలిపినారు. ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మిగతా హాస్పిటల్స్ యాజమాన్యం వ్యాపార యజమానులు ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్ఐ వినోద్, శేఖర్, ఆర్ఎస్ఐ సుమన్, చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.
