గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపారు.ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం…
విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్, జకీర్ ఫారం హౌస్ లో తనిఖీలు చేయగా షేక్ షకీల్, దాగే దాతూరం, దాతే మధుకర్లు కలిసి గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురిని పట్టుకొని వారినుంచి మొత్తం 184 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
షేక్ షకీల్ వద్ద 134 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకొని విచారించగా అతని మధుకర్ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు.
సమాచారం మేరకు మధుకర్ ఇంటికి వెళ్లి తనిఖీలు చేపట్టగా అక్కడే ఉన్న దాతూరం వద్ద మరో 50 గ్రాముల ఎండు గంజాయినీ,ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
