HomeTelanganaNizamabadశ్రీ చైతన్య పాఠశాలకి ప్రభుత్వ అనుమతులు లేవు..నూతన బ్రాంచిలో అడ్మిషన్స్ తీసుకోకూడదు..జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ వెల్లడి.

శ్రీ చైతన్య పాఠశాలకి ప్రభుత్వ అనుమతులు లేవు..నూతన బ్రాంచిలో అడ్మిషన్స్ తీసుకోకూడదు..జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ వెల్లడి.

నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది ‘శ్రీ చైతన్య స్కూళ్ల’ పరిస్థితి. స్కూల్ నిర్వహణ కోసం నగరంలోని బైపాస్ రోడ్డులోని నూతన బిల్డింగ్ పనులు పూర్తి కాకుండానే, స్కూల్ కు అనుమతులు తీసుకోకుండానే కొత్త బ్రాంచ్ లను ఓపెన్ చేశాయని,అందుకు పేరెంట్స్ కు కట్టు కథలు చెప్పి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెలువెత్తడంతో జిల్లా విద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

ఈ మేరకు శ్రీ చైతన్య పాఠశాలలో పిల్లలను అడ్మిషన్లు చేయకూడదని శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఓ ప్రకటనలో తెలిపారు.

శ్రీ చైతన్య పాటశాల కొత్త బ్రాంచి నిజామాబాద్ బైపాస్ రోడ్ లో నేషనల్ మార్ట్ వేణుకలలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలకి ప్రభుత్వ అనుమతులు లేవని స్పష్టం చేశారు.

ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు మీ పిల్లలను శ్రీ చైతన్య పాటశాల నిజామాబాద్ బైపాస్ రోడ్ లో నేషనల్ మార్ట్ వేణుకలలో ఉన్న పాఠశాలలో అడ్మిషన్ చేయకూడదని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments