HomeLaw and Orderబాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.. స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.. స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.45 గంటల సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న జిల్లా పాలనాధికారికి అదనపు కలెక్టర్లు సాదరంగా స్వాగతం పలికారు.

నేరుగా తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులతో భేటీ అయ్యి జిల్లా స్థితిగతులు, స్థానిక పరిస్థితుల గురించి వారితో చర్చించారు.

అంతకుముందు కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా పాలనాధికారిని ఆయన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు.

అదనపు కలెక్టర్లతో పాటు ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్ కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments