పదేళ్ల అధికారంలో ఉన్న బిఆర్ యస్ కు అండగా నిలిచిన మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ లోకసభ సభ ఎన్నికలో ఎవరి వైపు వుంటారో ననేది ఆసక్తిగా మారింది.జాతీయ రాజకీయ సమీకరణ ల నేపథ్యంలో యంఐయం ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. నిన్నటి దాక రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న ఆ నేతలు ఇంకా లోకసభ ఎన్నికల మీద పూర్తీ స్థాయిలో దృష్టి పెట్టలేక పోయారు. కానీ హైదరాబాద్ లోకసభ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ యంఐయం పార్టీల లమధ్య అవగాహన కుదిరిందని చెప్తున్నారు.
హైదారాబాద్ లో యంఐయం కు మద్దతు ఇచ్చేసి జిల్లాలో మాత్రం తమకు అనుకూలంగా పనిచేసేలా అవగహన కుదిరిందని ప్రచారం జరుగుతుంది. రెండు మూడు రోజుల్లో ద్వితీయ శ్రేణి నేతలకు దారు సలామ్ నుంచి సంకేతాలు వచ్చే అవకాశం ఉంది. నిజామాబాద్ లోకసభ పరిధి బోధన్ నిజామాబాద్ ఆర్మూర్ కోరుట్ల జగిత్యాల్ ప్రాంతాల్లో యంఐయం ప్రాబల్యం బలంగా ఉంది. నిజామాబాద్ నగరంలో డిప్యూటీ మేయర్ తో పాటు 16 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి చెందిన వారున్నారు. బోధన్ లో నలుగురు కౌన్సిలర్లు ఉన్నారు.
పదేళ్ల పాటు అధికారంలో బిఆర్ యస్ పార్టీ తో చెట్టపట్టాలు వేసుకోని తిరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము జిల్లాలోనూ పోటీ కి దిగబోతున్నామని అధినేత హాసద్ బీరాలు పలికారు. కానీ తర్వాత వెనక్కి తగ్గి హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. కానీ జిల్లాలో బిఆర్ యస్ అభ్యర్థులకే మద్దతు ప్రకటించారు. కానీ నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా షబ్బీర్ అలీ రంగంలోకి దిగడంతో యంఐయం పునరాలోచనలో పడింది.
ముస్లిం వర్గాల్లో షబ్బీర్ కు అనుకూలంగా మారడంతో కొందరు కార్పొరేటర్లు ప్లేట్ ఫిరాయించారు. లోపాయికారి షబ్బీర్ కే వోట్లు వేయాలంటూ వోటర్ల ను పురమాయించారు. దాదాపు ఎనిమిది మంది కార్పొరేటర్లు కోవర్టు లుగా అవతారం ఎత్తారు.బిఆర్ యస్ అభ్యర్థి బిగాల గణేష్ తో పైకి దోస్తాని చేస్తూ ఆర్థిక ప్రయోజనాలు పొందినా షబ్బీర్ అలీ జై కొట్టారు. ఎమ్మెల్సీ కవిత సైతం కోవర్టు ల గుట్టు రట్టుచేశారు. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిది. వారు స్థానిక కాంగ్రెస్ నేతల ఒత్తిడి తో అనివార్యంగా షబ్బీర్ కు వోట్లు వేయాలనిచెప్పారు.
బోధన్ సెగ్మెంట్ లో షకీల్ ఓటమి లక్ష్యంగా స్థానిక యంఐయం కౌన్సిలర్లు కాంగ్రెస్ కు వోట్లు వేయాలంటూ బాహాటంగా ప్రచారం చేసారు. ఇద్దరు కౌన్సిలర్ల మీద షకీల్ హత్య యత్నం కేసు పెట్టి జైలు కు పంపారు.అధినేత హాసద్ జైలు కు వచ్చి కౌన్సిలర్ లను పరామర్శించారు.అందుకే బోధన్ బిఆర్ యస్ అభ్యర్థి విషయంలో హాసద్ కూడా స్తానిక నేతల వైఖరి ను వారించలేక పోయారు. అలాగే అర్బన్ షబ్బీర్ విషయంలోనూ హాసద్ లోలోపల షబ్బీర్ కు వ్యతిరేకంగా పనిచేయడానికి ఆసక్తి చూపలేదు.
అందుకే ఆయన మొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జిల్లాలో అడుగుపెట్టలేక పోయారు. బిఆర్ యస్ అధికారం కోల్పోవడంతో యంఐయం భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో బిఆర్ యస్ తో బంధాలు తెంచేసుకొని కాంగ్రెస్ తో దోస్తీ కోసం పావులు కదుపుతుంది