కొత్త డీజీపీ గా శివధర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్న ప్రభుత్వం ఆయన స్థానంలో కొత్త నిఘా విభాగం అధిపతి గా ఎవరని నియమించాలనేది ఎడతెగని కసరత్తులు చేస్తుంది. డిజిపి నియామకం లో సవా లక్ష నిబంధనలను అధిగమించి జీవో ఇవ్వాలి.
కానీ అత్యంత కీలకమైన ఇంటలిజెన్స్ అధిపతి నియామకం లో ఎలాంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. సీఎం తో రోజు నేరుగా మాట్లాడేది ఇంటలిజెన్స్ అధిపతి ఒక్కరే డీజీపీ అవసరాల మేరకే సీఎం ను కలుస్తారు.
అందుకే ఇంటలిజెన్స్ బాస్ గా ఎవరిని నియమించాలనేది సీఎం కు కీలకం. సమర్ధుడైన వారే కాదు నమ్మకస్తుడైన అధికారికి ఆ బాధ్యతలు ఇస్తారు.
అందుకే రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టాక డిజిపి నియామకం ఆలస్యం చేసిన ఇంటలిజెన్స్ అధిపతి గా రోడ్ సేఫ్టీ లో ఉన్న శివధర్ రెడ్డి ని నియమించారు.
అందుకు తగ్గట్టుగానే ఆయన నమ్మకస్తుడిగా పనిచేస్తూ వస్తున్నారు. అందుకే కొత్త డిజిపి గా అయన కే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.
ఎలాగో ఆయన్ను పూర్తీ స్థాయి డీజీపీ గా నియమించడానికి నిబంధనలు ఒప్పుకోవు అందుకే ఇంచార్జ్ తోనే సరిపెట్టనున్నారు. శివధర్ రెడ్డి స్థానంలో ఎవరికి నిఘా విభాగం అప్పగించాలనేది క్లిష్టంగా మారింది.
ఇద్దరు పేర్లే తుది పరిశీలనకు వచ్చాయి. ఇందులో ఒకరు విజయ్ కుమార్ కాగ మరొకరు చంద్రశేఖర్ రెడ్డి లున్నారు. విజయ్ కుమార్ అదనపు డిజి హోదాలో ఏసీబీ లో పనిచేస్తున్నారు.
ఆయన ఏసీబీ కి వచ్చాక రాష్ట్రం లో అవినీతి అధికారులు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఏసీబీ అంటేనే వణుకు పుట్టేలా చేసారు. సమర్ధుడైన అధికారి గా ముద్ర వేసుకున్నారు పైగా ఆయన గతంలో ఇంటలిజెన్స్ బ్యూరో లో సుదీర్ఘ కాలం పనిచేసారు.
నిఘా విభాగంలో ఎలా పనిచేయాలో విజయ్ కుమార్ కు నైపుణ్యం కూడా ఉంది. అందుకే అయన వైపు రేవంత్ సర్కార్ మొగ్గు చూపుతుంది. కానీ ఏసీబీ వ్యవస్థ మళ్ళీ గాడి తప్పే అవకాశం వుందని భావిస్తున్నారు అదీగాక ఆయన విధేయుడిగా వుంటారా లేదా అనేది కూడా అనుమానమే.
ఈ నేపథ్యంలోనే మల్టి జోన్ ఐజి గా ఉన్న చంద్ర శేఖర్ రెడ్డి పేరు తెరమీదకి వచ్చింది.శివధర్ రెడ్డి ఈ పేరు ను సీఎం కు ప్రతిపాదించారని ప్రచారం జరుగుతుంది.
చంద్ర శేఖర్ రెడ్డి కూడా శివధర్ రెడ్డి కి అత్యంత నమ్మకస్తుడి గా ఉన్నారు. మొత్తంగా ఇద్దరు లో ఒకరికి నిఘా విభాగం బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉంది.
డిజిపి గా అవకాశం రాని పక్షంలో సీవీ ఆనంద్ సిటీ సీపీ గా ఉండే ఛాన్స్ లేదు ఆయన్ను విజిలెన్స్ లేదా ఏసీబీ లకు పంపి సిటీ సీపీ గా అదనపు డిజి ల్లో ఒకరిని నియమించనున్నారు.ఆర్టీసీ యండి గా పనిచేస్తున్న సజ్జనార్ సిటీ సీపీ గా ఇవ్వాలని ప్రభుత్వం పెద్దలను ఒత్తిడి చేస్తున్నారు.
