హైదారాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద పుష్పా సినిమా బెనిఫిట్ షో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ, మృతి చెందగా ఆమె కుమారుడు అస్వస్థతకు గురి అయ్యారు. తొక్కిసలాట జరగడంతో ఊపిరి ఆడక పోవడంతో ఆమె అక్కడే స్పృహ కోల్పోయారు.
వెంటనే వారికి పోలీసులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మహిళా మృతి చెందగా.. ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నాడు. మృతురాలిని రేవతి (36)గా పోలీసులు గుర్తించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రపంచ వ్యాప్తంగా పుష్పా సినిమా ను గురువారం రిలీజ్ చేసారు అయితే సంధ్య థియేటర్లో కూడా బుధవారం రాత్రి 9.30కి పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వచ్చాడు.
తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలియడంతో పెద్ద ఎత్తున బన్నీ ఫ్యాన్స్ సంధ్య థియేటర్ వద్దకువచ్చి ఆయనను చూడడానికి ఎగ బడ్డారు ఈ క్రమంలో అభిమానులని కట్టడి చేయడానికి పోలీసు స్వల్పంగా లాఠీ ఛార్జి చేశారు దీనితో తొక్కిసిలాట జరిగింది.
