ఈ నెల 21,22 తేదీలలో వనపర్తి లో జరిగిన సీఎం కప్ టోర్నమెంట్ లో నిజామాబాదు మహిళా ల జట్టు మొదటి స్థానం సాధించి విజయ కేతనం ఎగురా వేసింది. జిల్లా జట్టు లేగ్ లో భూపాలపల్లి, జనగామ, మంచిర్యాల ల పై విజయం సాధించి క్వాటర్ ఫైనల్ చేరుకుంది.
క్వాటర్ ఫైనల్ లో ఖమ్మం పై సునయసాముగా విజయం సాధించి సెమీ ఫైనల్ చేరుకుంది. సెమీస్ లో నల్గొండ పై విజయం సాధించి ఫైనల్ చేరుకీంది. ఫైనల్లో కామారెడ్డి పై ( 2-0 ) రెండు సెట్ల లో విజయం సాధించి బంగారు పథకం సాధించింది.
ఈ టోర్నమెంట్ లో రిక్కీ రెడ్డి, లక్కీ రెడ్డి, అవనిక, అనన్యారెడ్డి ల సమిష్టి ప్రతిభ తో టోర్నమెంట్ లో సునయస విజయం సాధించ్చిందని కోచ్ మరియు సెపక్ తక్రా జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాధరి సంజీవ్ రెడ్డి తెలిపారు.
జిల్లా జట్టు విజయం పట్ల జిల్లా క్రీడా సంస్థ అధికారి క్రీడాకారుల కు, కోచ్ కు అభినందనలు తెలియచేసారు. అలాగే జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఈగ సంజీవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ అంద్యాల లింగన్న పలు క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేసారు.
బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం లో రాష్ట్ర సెపక్ తక్రా అధ్యక్ష్య, కార్యదర్శులు సురేష్, రిక్క శ్రీనివాసరెడ్డి డి.వై.ఎస్ ఓ సాగర్, సెపక్ తక్రా అంతర్జాతీయ క్రీడాకారుడు వికెష్ చేతుల మీదుగా మెమంటో అందుకొన్నారు.
