వచ్చే లోకసభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ని గెలిపించడానికి కోసం యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కృషిచేయాలని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ పిలుపు నిచ్చారు .
గురువారం జిల్లా నగర యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జిల్లా కాంగ్రెస్ భవన్ లో నిర్వహిచారు , ఈ కార్యక్రమాలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి, ప్రధాన కార్యదర్శి సామ్రాట్, సోషల్ మీడియా ఇంచార్జి నీహార్ అసెంబ్లీ అధ్యక్షులు ప్రీతం, నరేష్, నాగేంద్ర, ఫర్హాన్, శ్రీకాంత్లు పాల్గొన్నారు . రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో . యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం చేయాలనీ నిర్ణయించారు .
ఈ సందర్బంగా డోర్ టు డోర్ కరపత్రాలను ఆవిష్కరించారు.అదేవిధంగా నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ కులాల అభివృద్ధి కొరకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకంచేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ సభ్యులు,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు,నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.