పులి వచ్చింది అంటూ పుకార్లు స్థానిక ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసింది. నగరంలో క్రిస్టియన్ కాలనీ లోని యస్ ఆర్ కాలేజి హాస్టల్ వద్ద ఫులాంగ్ వాగు సమీపంలో రెండు పులులు కనిపించాయని కొందరు స్థానికులు చెప్పడంతో అవే సోషియల్ మీడియా లో వైరల్ అయ్యాయి. దీనితో స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అయింది. గురువారం రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఆప్రాంతంలో కాలు ముద్ర లను గుర్తించే ప్రయత్నం చేసారు. కానీ దొరికిన ఆనవాళ్ల మేరకు పులి ఆ ప్రాంతంలో సంచరించినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని అధికారులు చెప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు