పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిదే విజయం
- నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
- ఆర్మూర్ లో నిర్వహించిన పార్లమెంటు స్థాయి కార్యవర్గ సమావేశం
- హాజరైన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, సూర్యనారాయణ గుప్తా
ఇది సంగతి. ఆర్మూర్. జాన రమేష్: పార్లమెంటు ఎన్నికల్లో విజయం తమదేనని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు . జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్లో పార్లమెంటు స్థాయి కార్యవర్గ సమావేశం కార్యక్రమం నిర్వహించారు.హాజరైన నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, సూర్యనారాయణ గుప్తాలు మాట్లాడారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ….పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత ఎన్ని ప్రయోగాలు చేసిన ఓటమి ఖాయం అని అన్నారు.భారతదేశంలో 540 సీట్లలో 400 భారతీయ జనతా పార్టీ వస్తాయని అంచనా వేశారు.
నిజామాబాద్ పార్లమెంట్లో అధిక మెజార్టీతో బిజెపి పార్టీ గెలుస్తుందని, పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు పసుపు ధర 20000 పెరగడానికి కారణం బిజెపి పార్టీయేనని వివరించారు. కాంగ్రెస్, బీ,ఆర్,ఎస్, పార్టీలను చిత్తుగా ఓడిస్తామని ధీమా వ్యక్తంచేశారు. అతి త్వరలో జగిత్యాల లో జరగబోయే మోడీ బహిరంగ సభకు బిజెపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి , దినేష్ కులాచారి, ఏలేటి మల్లికార్జున్ రెడ్డి లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
