ఎల్లారెడ్డి, ఎల్లారెడ్డి పట్నంలో సినీ పక్కిలో రెండు లక్షల రూపాయలు చోరీ జరిగింది. బ్యాంకు నుంచి డ్రా చేసి బైక్ ట్యాంకు కవర్లో ఉంచిన డబ్బులను గమనించిన దొంగ ఎత్తుకెళ్లాడు. బుధవారం జరిగిన చోరీకి సంబంధించి బాధితుడు స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఎలా ఉన్నాయి.
కామారెడ్డి లో ఉండే ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన రషీద్ పటేల్ తన కూతురు వివాహం కోసం స్థానిక యూనియన్ బ్యాంక్ నుంచి మూడు లక్షల రూపాయలు డ్రా చేశాడు. చేతిలో బ్యాగు లేకపోవడంతో ఆ డబ్బులను బైకు ట్యాంక్ కవర్లో ఉంచి పట్టణ శివారులోని మిర్చి గిర్నీ వద్దకు వెళ్లాడు.
అక్కడ ఎండుమిర్చిని కొనేందుకు బైక్ దిగి వెళ్లేసరికి గుర్తులేని వ్యక్తి వచ్చి బైక్ లో ఉన్న 3 లక్షల రూపాయల నుంచి 2 లక్షల రూపాయలను ఎత్తుకొని మోటార్ సైకిల్ పై పారిపోయాడని బాధితుడు రషీద్ పటేల్ చెప్పారు.
బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి వెళ్తున్న రషీద్ వెనకాలే సదరు గుర్తిలేని దొంగ అనుసరించాడని తెలుస్తుంది. దొంగను గుర్తుపట్టేందుకు సిసి ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. కాగా దొంగతనంపై స్థానిక పోలీస్ స్టేషన్లో రషీద్ పటేల్ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
