అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే..
నగరంలోని ఎన్జిఓ కాలనీ ప్రాంతంలో కోడే సంపత్ గంజాయి విక్రయిస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ శ్రీనివాస్ రాజ్ ఆద్వర్యంలో మూడవ టౌన్ పోలిసులు పట్టుకొని తనికి చేయగా అతని వద్ద 230 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అధిక డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర లోని నాందేడ్ నుంచి గంజాయి తీసుకొచ్చి నిజామాబాద్ చుట్టూ పక్కల ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు.
