నిజామాబాద్ నగరంలో రంజాన్ పండుగ కు సంబందించి ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ శనివారం సమీక్షించారు.
నగరంలోని జదీద్ ఈద్గా, మదీనా ఈద్గా, ఐలే హదీస్ ఈద్గా, లను సందర్శించి మదినా ఈద్గా అభివృద్ధికి బోర్ మోటర్ తో పాటు అక్కడి స్థలాన్ని చదును చేయడానికి 300 ట్రిప్పుల మొరం వేయించడానికి అలాగే పండుగ రోజు తాగునీరు మరియు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఏలాంటి అవకతవకలు జరగకుండా పనులన్నీ సమయానికి సక్రమంగా జరగాలని షబ్బీర్ అధికారులను ఆదేశించారు
