స్థానిక ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు కు తెరలేసింది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల్లో సంస్థాగత ఎన్నికల పక్రియ శర వేగంగా సాగుతుంది. జిల్లా అధ్యక్ష పదవీ రేసు రసకందాయంలో కి వచ్చింది.
పార్టీ యూత్ క్యాడర్ లో బలమైన పాలోయింగ్ ఉన్న నేతలు అధ్యక్ష పదవీ చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పార్టీ నియమావళి మేరకు అధ్యక్ష పదవీ ఎన్నిక పక్రియ జరుగుతుంది.
నిజానికి అధ్యక్ష పదవీ దక్కించుకోవాలనే లక్ష్యంతోనే ఔత్సహిక యూత్ నేతలు సభ్యత్వ నమోదు ను పోటాపోటీగా చేసుకున్నారు. అనుబంధసంఘాల సంస్థాగత ఎన్నికల పక్రియ లో కాంగ్రెస్ నేతలెవ్వరూ తల దూర్చద్దు.
కానీ ఈసారి పార్టీ అధికారంలో ఉండడంతో ఎన్నికల్లోనూ సైతం సీనియర్ నేతలు తలదూర్చుతున్నారు. రచ్చ కు తెరలేపుతున్నరు. నిజామాబాద్ జిల్లా అధ్యక్ష పదవీ వ్యవహారంలోనూ ఇదే జరుగుతుంది. ఇందులోనూ తమ ఆధిపత్యం ఉండేలా నేతలు తెరవెనుక నుంచి పావులు కదుపుతున్నారు.
అదే ఇప్పుడు యువజన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో చిచ్చు పెట్టింది. అధ్యక్ష స్థానం కోసం బీమ్ గల్ కు చెందిన యువనేత నాగేంద్ర తో పాటు యన్ యస్ యూ ఐ నేత విపుల్ తో పాటు బోధన్ నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లకు చెందిన మరో ఇద్దరు పోటీ పడుతున్నారు.
కానీ నాగేంద్ర రేసులో అనూహ్యంగా దూసుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తనను లక్ష్యంగా బాల్కొండ ఇంచార్జ్ ఆరెంజ్ సునీల్ రెడ్డి తెరవెనుక పావులు కడుపుతుండడం ఫై నాగేంద్ర లోలోన రగిలి పోతున్నారు.
పార్టీ అధికారంలో లేక పోయిన పదేళ్లు నియోజకవర్గంలో యూత్ క్యాడర్ తో మమేకం అయి పనిచేసిన తన విషయంలో సునీల్ రెడ్డి తనకు ప్రతికూలంగా వ్యవహరించడం ఫై నాగేంద్ర జీర్ణించుకోలేక పోతున్నారు.
ప్రతికూల పరిస్థితులను అధిగమించి పార్టీ అంటి పెట్టుకొని పనిచేసిన తన మీద కుట్రలు జరగడం ఫై కొందరు సీనియర్ నేతల తో నాగేంద్ర ఆవేదన చెందుతున్నారు.
అదీగాక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొత్తగా పార్టీలోకి వచ్చి నప్పటికి ఆరెంజ్ సునీల్ విజయం కోసం తాను పనిచేసారు. అనిల్ ఇరవత్రి అనుయాయుడైన నాగేంద్ర యూత్ పదవీ రేసులో ఉన్నారు.
కానీ అండగా ఉండి మరింత ప్రోత్సహించాల్సిన సునీల్ రెడ్డి తనకు ప్రతికూలంగా పావులు కదుపుతుండడంఫై నాగేంద్ర సీనియర్ నేతలతో వాపోతున్నారు. నిజానికి గత కొన్నేళ్లుగా యువజన కాంగ్రెస్ అధ్యక్ష స్థానం ఆర్మూర్ ప్రాంతానికి దక్కడం లేదు.
అర్బన్ లేదంటే బోధన్ సెగ్మెంట్ నేతలే ఎగురేసుకెళ్లుతున్నారు. అందుకే ఈసారి మారుమూల ప్రాంతమైన బీమ్ గల్ కు చెందిన నాగేంద్ర రెండేళ్లుగా ఇదే కార్యాచరణలో పనిచేసుకుంటున్నారు.
కానీ అండగా ఉండాల్సిన సీనియర్ నేతే అడ్డు పడడం యూత్ నేతల్లో హాట్ టాపిక్ గా మారింది ఎందుకు అసలు ఎం జరిగింది రేపు బాల్కొండ లో యువ నేత పోటీ అనుకుంటున్నాడ లేక అతని ఆటలు సగవానుకుంటున్నారా సొంత నియోజకవర్గ యువనేత పైన చేస్తున్న ఆ నాయకుడి కుట్రలు నియోజకవర్గం నేతలంతా ఆ నాయకుడిపై గుర్రగా ఉన్నారు