HomeTelanganaNizamabadఅధికార పార్టీ నాయకులకు గులాం గిరి చేస్తున్న పోలీసులు నగరం వదిలేయండి ......సీఐ బదిలీ లు...

అధికార పార్టీ నాయకులకు గులాం గిరి చేస్తున్న పోలీసులు నగరం వదిలేయండి ……సీఐ బదిలీ లు ఎందుకు నిలిపేశారో సీపీ చెప్పాలి ……. -అర్బన్ ఎమ్మెల్యే

పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు అధికార పార్టీ లో ఓడి పోయిన నేతలకు గులాం గిరీ చేస్తున్నారని వారి వల్లే పోలీస్ వ్యవస్థ కు మచ్చ వస్తుందని నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు ఓ ప్రకటన విడుదల చేసారు

రాజకీయాలకు సంబంధం లేకుండా స్వయం ప్రతిపత్తితో ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీస్ రక్షణ వ్యవస్థ అధికార పార్టీ నాయకులకు గులాంగిరి చేయడం సిగ్గు చేటని అలాంటి అధికారులు ఖాకి చొక్కా తీసి ఖాద్దరు చొక్కా వేసుకోవాలన్నారు

నగరంలో కొందరి సీఐల పై ఎన్నో అభియోగాలు వస్తున్నా ఏళ్ల తరబడి అదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నా ఎందుకు వారి పై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు,

సీఐల బదిలీ ఉత్తర్వులు ఇచ్చి మళ్ళీ ఆపడం పై ఉన్న మతాలబ్ ఏంటో కమీషనర్ గారు ఐజీ గారు సమాధానం చెప్పాలన్నారు గత ప్రభుత్వం హయాంలో కొందరు ఖాకీలు గులాబీ కండువా వేసుకున్న కార్యకర్తలగ పని చేసి ప్రభుత్వం మారగానే వారు కూడా పార్టీ పిరాయించినట్లు కాంగ్రెస్ నేతలకు గులాం గిరి చేస్తున్నారని అన్నారు,

నిజామాబాదు నగరంలో పోలీస్ అధికారిగా పని చేయాలంటే ముందు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇక్కడ రావాలా ఏంటి అని ఏద్దేవా చేసారు ఓ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభుత్వ అన్ని శాఖల్లో తలదుర్చడం వల్లే ఈ తంతు అంత జరుగుతుందని మండిపడ్డారు

పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకు అపార నమ్మకం ఉందని కొందరు అధికారుల కారణంగా మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని అలాంటి వారు నిజామాబాదు నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని సూచించారు,

నగరంలో శాంతి భద్రతల పైన సామాన్యులకు న్యాయం చేసే అంశాల పైన దృష్టి పెట్టకుండా రాజకీయ నాయకులకు గులాంగిరి చేస్తానంటే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments