నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్ లో గల తెలంగాణ సూపర్ మార్కెట్ పురాని హావేలి దగ్గర పోలీస్ కానిస్టేబుల్ సయ్యద్ హమీద్ ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు ఆ ప్రాంతంలోని పరిస్థితులపై ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తారు.
ఇది గమనించిన ఆటో నగర్ కు చెందిన మహ్మద్ మునవర్ 14 నవంబర్,2018 న ఉదయం సదరు కానిస్టేబుల్ ను ఉద్దేశించి “నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు,నా ఏరియాలో చాలా తిరుగుతున్నావు,
చాలా రోజుల నుంచి నిన్ను గమనిస్తున్నాను,ముస్లిం యొక్క ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ను నీ పై అధికారులకు అందజేస్తున్నావు అని తెలిసింది.నీ డ్యూటీ ఇదేనారా :ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నీవు నన్ను కలవాలి.
నేను ఇక్కడ సొసైటీకి ప్రెసిడెంట్ ని ,ఇంకోసారి ఇటువైపు కనిపించినవో బిడ్డ..నీ కాళ్ళు విరగ గోడతా అని బెదిరించి,కానిస్టేబుల్ సయ్యద్ హమీద్ ఛాతిపై చేతులు వేసి నూకి వేశాడనే”
నేర అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణ లో రుజువు అయినట్లు నిర్థారిస్తూ మునవర్ కు ఒక సంవత్సరం సాధారణ జైలుశిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధించారు.
జరిమానా చెల్లించని యెడల అదనంగా రెండు వారాలు జైలుశిక్ష అనుభవించాలని జడ్జి శ్రీనివాస్ రావు తీర్పు లో పేర్కొన్నారు.
అర్సపల్లి శివారులో ప్రభుత్వ భూమిని ఆక్రమించి గుడిసెలు వేస్తున్నరనే సమాచారం మేరకు 24 దిశంబర్,2018 న నిజామాబాద్ మండల కార్యాలయ రెవిన్యూ సిబ్బంది వెళ్లగా అక్కడ ఉన్న మహ్మద్ అఖ్లాక్ అహ్మద్ అనే వ్యక్తి రెవిన్యూ సిబ్బందిని అధికారిక విధులు నిర్వహించకుండా ,విధులకు ఆటంక పరిచాడు.
గ్రామ రెవిన్యూ అధికారి అయిన గాజుల చిన్న నారాయణ ను దూషిస్తు కట్టెతో కొట్టి విధులు నిర్వహించకుండా ఆటంకపరిచాడనే అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో ధర్మపురి హిల్స్ నివాసుడైన మహమ్మద్ అఖ్లాక్ అహ్మద్ కు సంవత్సరంన్నర సాధారణ జైలుశిక్ష తోపాటు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ
న్యాయమూర్తి శ్రీనివాస్ రావు పదిహేను పేజీల తీర్పు వెలువరించారు.నిజామాబాద్ నగర ఆరవ టౌన్ పోలీసుల తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భూసారపు రాజేష్ గౌడ్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.
ప్రాసిక్యూటర్ కు ఆరవ టౌన్ కానిస్టేబుల్ గజానంద్ జాదవ్ సహాయకారిగా నిలిచారు.
