నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పట్టుకున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపారు.ఆమె తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని అర్సపల్లి,ఎల్లమ్మ కుంట కు చెందిన ఇద్దరు యువకులు, ఓ మహిళ కలిసి గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి 1.435 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అలాగే రెండు ద్విచక్ర వాహనాలు,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు.
