భీంగల్ మండలం గోనుగోప్పుల లో ఘటన – మద్యం మత్తులో కన్న కూతురిని కడతేర్చిన కసాయి తల్లి – నిందితురాలని అరెస్టు చేసిన భీంగల్ పోలీసులు జాన రమేష్ ఇది సంగతి ఆర్మూర్:
మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటనలు సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ పక్క కన్నవారిని కనికరించని కర్కశులు కొందరైతే, మరోపక్క కన్న బంధాన్ని తుంచేస్తున్న రాక్షసులు ఇంకొందరు.
ఇటీవల జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో రెండేళ్ల చిన్నారిని చిన్నమ్మ ఘోరంగా హత్య చేసిన ఘటన మరువకముందే నిజామాబాద్ జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసైన కన్న తల్లి ముక్కు పచ్చలారని కన్నా కూతురినే కడతెరిచింది.
అభం శుభం తెలియని బోసి నవ్వుల చిన్నారిని దుప్పటి కప్పి గొంతు నులిమి చప్పేసింది. హృదయాన్ని కలిచివేసింది ఈ సంఘటన. భీంగల్ మండలం గోనుగొప్పుల గ్రామానికి చెందిన గంగోని మల్లేష్, రమ్య లు గత 2 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.వీరి దాంపత్యానికి చిహ్నంగా ఐదు నెలల పండంటి ఆడబిడ్డ జన్మించింది.
ఆ చిన్నారికి ముద్దుగా శివాని అని పేరు కూడా పెట్టారు ఆ దంపతులు. అయితే మల్లేష్ ఓ రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తు ఇంటిని పోషిస్తున్నాడు.
అతని భార్య రమ్య కొన్ని మద్యానికి బానిసయింది. రమ్యను మద్యం మానమని ఆమె భర్త మల్లేష్ ఎన్నిసార్లు చెప్పినా రమ్య మధ్యం మాత్రం మానలేదు.మద్యం కు బానిసైన రమ్య పాపను పట్టించుకోలేదు.
మద్యం మని పాపను పట్టించుకోమన్ని లేకుంటే ఇంటి నుండి వెళ్ళపొమ్మని మల్లేష్ మందలించాడు. ఐతే ఆ చిన్నారి కి జ్వరం రావటం మందులు పోయకపోవటంతో భార్యను మందలించాడు.
దీనితో రమ్య ఆదివారం రోజు ఫుల్లుగా తాగిన రమ్య తాగిన మైకంలో ఆమె ఐదు నెలల కూతురు అయిన శివాని ని మొహం మీద దుప్పటి కప్పి గొంతు నులిమి చంపే వేసింది. అయితే రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన భర్త కూతురు ఎక్కడ అని అడగగా కూతురు చనిపోయింది అని చెప్పింది.. కూతురు శివాని ఎలా చనిపోయిందని అడగగా ఏదో పురుగు కుట్టి చనిపోయింది అంటూ బుకాయించింది.
అది నమ్మని భర్త మల్లేష్ గట్టిగా అడగగా తాను చేసిన ఘనకార్యం బయటపెట్టింది. భర్త మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అంతకురాలు రమ్యను అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ కు తరలించారు.
