రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇందిరా మహిళా శక్తి సంబరాలు వేల్పూర్ గ్రామంలో ప్రతి ఒక్క మహిళను భాగస్వామ్యం చేయాలని ఐకెపి జిల్లా ప్రాజెక్టు అధికారి సంధ్యారాణి అన్నారు .
మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహిళా సంఘాల ప్రతినిధులు హాజరై ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చర్చించుకోవడం జరిగింది.
ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు అంతేకాకుండా మహిళా సంఘాలకు భారీ స్థాయిలో వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు రాయితీ సైతం మంజూరు చేస్తుందన్నాని మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు సోలార్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు వంటి కార్యక్రమాలతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ యూనిఫాంలా తయారీ పాఠశాలల మరమ్మత్తులలో నిర్వహణ కార్యక్రమాన్ని మహిళా సంఘాలు చేపడుతున్నాయి అన్నారు.
ఏపిఎం మాణిక్యం మాట్లాడుతూ.. ప్రతి ఒక్క మహిళ సంఘంలో చేరాలని సంఘంలో ఉన్న మహిళలు రుణాలు తీసుకొని సద్వినియోగ పరచుకోవాలని ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి కుటుంబ పరిస్థితులను మెరుగుపరుచుకోవాలి అన్నారు .
బ్యాంకు నుండి రుణం 2 లక్షల వరకు తీసుకున్న సభ్యులు మరణిస్తే వారికి లోన్ బీమా రెండు లక్షల వరకు వర్తిస్తుంది అందులో భాగంగా వేల్పూరు గ్రామంలో రియానా బేగం తను లోను తీసుకుని అనుకోకుండా అనారోగ్యంతో సహజ మరణం చెందడంతో ఆ కుటుంబం తరఫున ప్రభుత్వం వారి యొక్క బ్యాంకులోని నిలువ ఒక్క లక్ష 87 వేల 631 రూపాయలు నామిని అయినా అతని కొడుకు ఇస్మాయిల్ కు చెక్కు ద్వారా అందించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు అధికారి సంధ్యారాణి ఏపియం మాణిక్యం సిసి లుఏడేల్లి రవి వెన్నమురళి గ్రామ సంఘం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు వివోఏలు పాల్గొన్నారు.
