HomeCRIME14 మంది మావోయిస్టులు హతం..మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.

14 మంది మావోయిస్టులు హతం..మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.

ఆ పార్టీ పీఎల్ జీఏ బెటాలి యన్-1 కమాండర్ బార్సె దేవా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన క్రమంలో ఛత్తీస్ గఢ్ లో రెండు ఎన్కౌం టర్లు చోటుచేసుకున్నాయి. సుక్మా జిల్లా కొంటా-కిష్టారం అడవుల్లో భద్రతా బల గాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్లో మొత్తం 12 మంది మావోయిస్టులు హతమయ్యారు.

వీరిని కొంటా ఏరియా కమిటీ సభ్యులుగా గుర్తించారు. అందులో కొంటా ఏరియా కార్యదర్శి సచిన్ మంగ్లూ కూడా ఉన్నారు. అయితే, కోంటా ఏఎస్సీ ఆకాల్రావు గిరిపుంజేను హత్య చేసిన మావోయిస్టు కమాండర్లు కూడా ఈ ఎన్ కౌంటర్లో హతమైనట్లు సమాచారం.

దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న పక్కా సమాచారంతో సుకుమా ఎస్పీ కిరణ్ చవాన్ పర్యవేక్షణలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది.

ఈ క్రమంలో ఈ ఉదయం సుమారు 5.30 గంటల ప్రాంతంలో భద్రతా బల గాలకు, మావోయిస్టులకు భీకరంగా ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. అనంతరం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఇప్పటి వరకు 12 మంది మావో యిస్టుల మృతదేహాలను భద్రతా బలగా లు గుర్తించాయి.

మరోవైపు బీజాపూర్ జిల్లాలోనూ జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మరి కొంతమంది గాయపపడగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి మూడు ఏకే-47 రైఫిల్స్తో పాటు భారీగా ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments