ఆరోగ్యం కాపాడుకోవడం ద్వారే అన్ని లక్ష్యాలు సాధించవచ్చని చెడు వ్యసనాలకు దూరంగా వుండాలని ప్రముఖ వైద్యులు భూమ్ రెడ్డి అన్నారు. మండలం లోని హాస కొత్తూరు పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో అవగాహనా కల్పించారు.
నిత్యం వ్యాయామం చేయడం ద్వారా మానసిక శారీరక వ్యక్తిగత ఆరోగ్యం మెరుగు పడుతుందని, ఏరోబిక్ వ్యాయామం చేయడం ద్వారా శరీరం లో ఎండార్ఫిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందని దానివల్ల మెదడు మరింత ఉత్తేజం పొందుతుందని అన్నారు.
ప్రతిరోజూ తప్పనిసరిగా ఆకు కూరలు కూరగాయలు విటమిన్ లున్న ఆహరం తీసుకోవాలని ప్రతిరోజూ 30 శాతం ప్రోటీన్ అవసరమని పండ్లు మొలకేత్తిన విత్తనాలు తీసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్య లేకుండ ఆరోగ్యం బాగుంటుందని అన్నారు.
మార్కెట్ లో సులభంగా లభించే ఫ్రై ఫుడ్ లు తీసుకోవద్దని, సెలఫోన్ లకు దూరంగా ఉండాలని పర్సనాలిటీని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. రాగి జావా జొన్న లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రధానోపాధ్యాయులు అరుణ శ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేవతి గంగాధర్, మాజీ సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
