HomeCRIMEఒక్క నెలలో 1708 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు.77 మందికి జైలు శిక్ష 62...

ఒక్క నెలలో 1708 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు.77 మందికి జైలు శిక్ష 62 డ్రైవింగ్ లైసెన్స్లలు రద్దు

నిజామాబాద్ లో మందుబాబులపై పోలీసులు కొరడాఝళిపిస్తున్నారు. గత నెలలో జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య గతం కంటే ఎక్కువగా ఉంటుందని ఇటీవల నమోదైన కేసులే చెబుతున్నాయి.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధులలో గత జులై నెలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు దాదాపు 1708 నమోదు అయినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 1708 లో 966 మంది నిందితులపై అభియోగాలు మోపుతూ చార్జీ షీట్ లు న్యాయస్థానాలలో వేయగా 966 మంది కేసులలో నిందితులు నేరాన్ని ఒప్పుకొనగా, ఇందు లో (77) కేసులలో జైలు శిక్షలు విధించగా మిగతాకేసులలో జరిమానాలు విధించినట్లు తెలిపారు.

తర్వాత ఆ వాహనము నడిపిన డ్రైవర్, రైడర్ యొక్క డ్రైవింగ్ లైసెన్ను సస్పెండ్ చేయమని ఆర్.టి.ఎ అధికారులను కోరగా గత జులై నెలలో మొత్తం ( 62) డ్రైవింగ్ లైసెన్స్లలను రద్దు చేసినట్లు తెలిపారు.

ఎవ్వరైనా మద్యం సేవించిన తర్వాత మీరు వాహనాలను నడపరాదని, వాహనాలను ఎవరికి ఇవ్వరాదని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments