HomeCRIMEసాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

మాదాపూర్‌లో ప్రైవేట్ హాస్టల్ భవనం పైనుంచి దూకి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన 23 ఏళ్ల యశ్వంత్, గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

అతను మాదాపూర్‌లో 10 రోజుల క్రితమే హాస్టల్‌లో చేరాడు.ఉదయం తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పిన యశ్వంత్, . ఆ తర్వాత కొద్దిసేపటికే హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments