ఛత్తీస్ ఘడ్ లో ని దంతెవాడఅటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎంకౌంటర్ లో మొత్తం 31 మంది మావోయిస్టు నక్సలైట్లు మృతి చెందారని ఎస్పీ గౌరవ్ రాయ్ వెల్లడించారు.
సుమారు 40 నుంచి 50 మంది మావోయిస్టులు సమావేశం అయ్యారని సమాచారం రావడంతో కేంద్ర బలగాలతో కలిసి గాలింపు మొదలు పెట్టామన్నారు.
ఎదురు కాల్పుల్లో 31 మంది నక్సల్స్ మృతదేహాలు లభ్యం అయ్యాయని సంఘటన స్థలం నుంచి ఏకే 47 తో ఎల్ ఏం జి ,ఇన్సాస్ వంటి ఆదునిక ఆయుధాలు స్వాదీనం చేసుకున్నామని మృతుల్లో అగ్రశ్రేణి నేతలున్నారని అనుమానిస్తున్నామని కేంద్ర కమిటీ నేతలు నంబాళ్ల కేశవరావు తక్కళ్లపల్లి వాసుదేవరావు లున్నారనేది అంచనాగా చెప్తున్నారు.
