గంజాయి విక్రయిస్తున్న 4గురు వ్యక్తులు అరెస్ట్ చేసినట్లు రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ చౌరస్తాలోని. ఎకె టి అండ్ కాఫీ పాయింట్ దగ్గర కొంతమంది వ్యక్తులు నిషేధిత గంజాయి కలిగి ఉన్నారని సమాచారం రాగానే వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా నలుగురు వ్యక్తులు అనుమాన స్పద స్థితిలో కనిపించడంతో వారిని చెక్ చేయగా వారి దగ్గర నిషేధిత గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు నిషేధిత గంజాయిని తక్కువ ధరకు కొనుక్కొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముకొని లాభాలు పొందుతున్నట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నేనావత్ మోహన్, అక్షిత్, సిద్దార్థ్, ప్రశాంత్ అను వ్యక్తుల నుండి 250 గ్రాముల గంజాయిని స్వాధీన పరుచుకొని వారి పైన కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇట్టి గంజాయిని వీరు మహారాష్ట్ర ఒరిస్సా తదితర ప్రాంతాల నుండి కొనుక్కొని వచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మడం జరుగుతుందన్నారు. ఎవరైనా నిచయిత గంజాయి కలిగి ఉన్న సేవించిన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయని నిజామాబాద్ రూరల్ పోలీసులు తెలిపారు.
ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల యొక్క వివరాలు గోప్యంగ ఉంచబడతాయన్నారు.
